ప్రభాస్ ‘కల్కీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. మహాభారతం ముగింపుతో సినిమా కథను మొదలు పెడుతూ.. హిందు పురాణాల్లోని కొన్ని పాత్రలను సూపర్ హీరోగా నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం.. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మే 09న రిలీజ్ చేస్తానంటూ మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఆ సమయానికీ నేషనల్ వైడ్ ఎన్నికలు జరుగుతుండటంతో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే పోస్టుపోన్ చేసిన ఈ సినిమాని తరువాత ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. తాజాగా రిలీజ్ డేట్ పై ఓ స్పష్టత వచ్చింది. చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. కల్కి మూవీని జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. మే 09న రావాల్సిన సినిమా జూన్ లో వస్తుందా..? అని బాధ పడుతుండటం గమనార్హం.

Spread the love