సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ కు ఒక్క అవకాశం ఇవ్వండి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ గెలుపును కోరుతూ  శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న జహంగీర్ కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరారు. భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన తర్వాత రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజా సమస్యల  పరిష్కారం కోసం పనిచేయకుండా వాళ్ల పదవులను, స్వంత వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రయత్నించారన్నారు. ఈ ప్రాంతంలో రైతాంగానికి సాగునీరు అందించే బునాది గాని కాలువను పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జహంగీర్ యొక్క సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే రైతాంగ సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. బునాది గాని కాలువను పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి మూసి మురుగునీరు కాకుండా గోదావరి  జలాలను సాగునీరుగా అందిస్తారని తెలిపారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి ఈ ఎన్నికల్లో జహంగీర్ ను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,జిల్లా నాయకులు మామిడి వెంకట్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ మొగిలిపాక గోపాల్,దొడ్డి భిక్షపతి, సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి గుండెపురి నరసింహ,  సీనియర్ నాయకులు జక్కా రాఘవరెడ్డి, మొగిలి పాక జహంగీర్, ఎస్ఎఫ్ఐ నాయకులు వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
Spread the love