కుక్క దాడిలో గాయపడిన యువకుడు మృతి

– కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డీ నేటరుగా పని చేస్తున్న నరేందర్
– గురువారం అర్ధరాత్రి మృతి
– బాధతో కన్నీరు గార్చిన ఎంఎల్ ఏ జయవీర్
నవతెలంగాణ – పెద్దవూర
కుక్కకాటు కారణంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం బసిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తుడుం నరేందర్ (30) కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డీ నేటరు గా పనిచేస్తున్నారు. గత 7 నెలల క్రితం బసిరెడ్డి పల్లి గ్రామంలో తన ఇంటినుంచి నడచుకుంటూ వెళుతుండగా కుక్క దాడి చేసి గాయపరిచింది.  ఈ ఘటనలో నరేందర్ కాలుకు కుక్క కాలి గొర్లు గీరుకొని చిన్న గాయం అయింది. ఈ గాయాన్ని అశ్రద్ధ చేయడంతో ఏడు నెలల తరువాత అతనికి రేబిస్ వ్యాధి సోకింది. ఉగాది పండుగ రోజు స్నానం చేయుటకు బాతురూం లోకి వెళ్లి ఒంటిపై నీళ్లు పోసుకోగా.. కరెంటు షాక్ తగిలినట్లుగా ఒకేసారి వణుకుతూ భయంతో ఇంట్లోకి వచ్చాడు. గమనించిన కుటుంభ సభ్యులు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికీ తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విశమంగా ఉందని, హైదరాబాద్ తీసుకెళ్లాలని తెలిపారు. ప్రథమచికిత్స అందించిన స్థానిక వైద్య సిబ్బంది హైదరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.  నరేందర్ కు కుక్క కరవడం తో పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. మందులు వాడుతున్న క్రమంలో గురువారం రాత్రి 12 గంటల సమయంలో వాంతులు కావడం, పరిస్థితి విషమించి నరేందర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సౌమ్యుడైన నరేందర్ చనిపోవడం బాధాకరమని బాధిత కుటుంబానికి ఎంఎల్ ఏ ఆర్థిక భరోసా కల్పించాలని స్థానికులు కోరారు. అదేవిదంగా గ్రామంలో కుక్కలు చిన్నారులను, యువకులను, మహిళలను వెంబడించి గాయాలు చేస్తున్నాయని, వాటి బాధ నుంచి గ్రామ ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రజలు కోరుకుతున్నారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె వున్నారు.
నరేందర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆడుకుంటాము.. మాజీ మంత్రి జానారెడ్డి
కుక్క కాటుతో మృతి చెందిన తుడుం నరేందర్కు కుటుంభాన్ని అన్నివిధాలుగగా ఆదు కుంటామని మాజీ మంత్రి జానారెడ్డి, ఎంఎల్ ఏ జయవిర్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్డి రఘు వీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం నరేందర్ భౌతిక కాయానికి పూల మాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. నరేందర్ మృతి కాంగ్రెస్ పార్టీకీ తీరని లోటని, కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డీ నేటర్ గా పనిచేస్తూ పార్టీకీ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నరేందర్ మృతితో ఎంఎల్ ఏ జయవిర్ బాధతో కన్నీరు పెట్టారు. జిల్లా మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, మాజి ఎంపీపి రామావత్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రేస్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి, పిఏసీఎస్ ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డి,మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి, ఎస్సీ సెల్ అధ్యక్షులు దండు బిక్షం, నాయకులు సైదయ్య బాబు, సంతోష్, మాజీ సర్పంచులు సుంకి రెడ్డి సంజీవ రెడ్డి, రావుల శ్రీనివాస్, కట్టేబోయిన రామ లింగయ్య,నడ్డి ఆంజనేయులు, కోట అంజి పరామర్శించిన వారిలో వున్నారు.
Spread the love