ఈ పాపం ఎవరిది.?

– పదుల సంఖ్యలో కోతుల మృత్యువాత
– ట్యాంక్ వైపు కన్నెత్తి చూడని సంబంధిత సిబ్బంది
–  ట్యాంక్ క్లినింగే మరిచారా…
–  ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ లో వానారాల కళేబరాలు. గత కొన్ని రోజులుగా నీటి సరఫరా అవుతున్న అదే కలుషిత నీటిని తాగుతున్న వార్డు ప్రజలు. వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో  లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందిన సంఘటన. సుమారు 20 నుండి 30 వరకు కోతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించడం కలకలం రేపింది.ట్యాంక్ లో 20,30కి పైగా కోతులు మృతి చెంది కుప్పగా ఉండటం స్థానికంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.అయితే పదుల సంఖ్యలో వానరాలు చనిపోవడానికి గల కారకులెవరు అనే ప్రశ్న ప్రజాలనుండి వస్తున్న మాట.నీటి సరఫరా సిబ్బంది కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదా.. ట్యాంక్ శుద్దిచేయడం మరిచారా.. ప్రజల ఆరోగ్యాలతో చేలాగాటమడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ట్యాంక్ పై మూత ఏర్పాటు చేయాలన్న కనీస జ్ఞానం లేకుండా సంబంధిత అధికారుకు,సిబ్బంది ఉండటం ఏంటని ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న అధికారులు,సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు .వానారాల కళేబారాలను బయటికి తీసే ప్రక్రియలో మునిసిపల్ సిబ్బంది ఉన్మారు.కోతుల మృతదేహాలను చూసి చుట్టుపక్కల ఉన్న మరికొన్ని కోతులు మున్సిపల్ సిబ్బందిపై ఎగబడుతుండడంతో భయపడుతూ కళేబారాలను తొలగిస్తున్న సిబ్బంది.
Spread the love