సాగర్లో వార్… వన్ సైడేనా…?

– కాంగ్రెస్ నుండి జానా తనయుడు జైవీర్ రెడ్డి
– బీఆర్ఎస్ నుండి నోముల నర్సింహయ్య కుమారుడు భగత్
– స్వాగతం పలుకనున్న సాగర్ ఓటర్లు
– భగత్ కు అసంతృప్తుల బెడద
– కాంగ్రెస్ ఆరు హామీల వైపే మొగ్గు: సర్వేలు
– జయవీర్ దే గెలువు అనుకుంటున్న సాగర్ ప్రజలు

నవతెలంగాణ-పెద్దవూర

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భగత్, జయవీర్ మధ్య వార్ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ నుండి మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు జయ వీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సిహయ్య తనయుడు భగత్ హోరాహోరీ తలపడుతున్నారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి నోముల నర్సింహయ్య, కాంగ్రెస్ నుండి కుందూరు జానారెడ్డి పోటీ పడగా జానాపై నోముల విజయం సాధించారు. 2021లో నోముల నర్సింహయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో సాగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో ఐదుగురు మంత్రులు, నియోజకవర్గ ఇంచార్జీలు, మండల, గ్రామ పంచాయితీలకు ఇంచార్జీ లను నియమించి ఒక యుద్ధంలా సాగిన ఎన్నికలో మద్యం, డబ్బు ప్రభావంతో ప్రజలు నాటి టీఆర్ఎస్ కు పట్టం గట్టారు. అయితే ఈసారి భగత్ పై వ్యతిరేకత, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు రావడం అంతేగాక మలివిడత తెలంగాణ ఉద్యమకారులు ప్రముఖ ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, కట్టేబోయిన అనిల్ కుమార్, వర్గం అంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దింతో సాగర్లో జయవీర్ విజయం సాధిస్తారని తెలుస్తుంది

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో..
పోలింగ్ ప్రదేశాలు 234,,పోలింగ్ కేంద్రాలు 299,
సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు 74,మహిళ పోలింగ్ కేంద్రాలు 5,మోడల్ పోలింగ్ కేంద్రాలు 05,
దివ్యాంగుల పోలింగ్ కేంద్రం 01,యూత్ పోలింగ్ కేంద్రo 1,రూట్లలు 32,వెబ్కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 161వున్నాయి.
సాగర్ నియోజకవర్గంలో ఓటర్లు
నియోజకవర్గ మొత్తం ఓటర్లు 2,33,412 ఉండగా
అందులో మహిళలు 1,18,640 మంది, పురుషులు పురుషులు1,14,752 మంది,ఇతరులు
20 మంది వున్నారు.నవంబర్ 30 న జరిగిన ఎన్నికల్లో మొత్తం 200235 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మహిళలు 100665, పురుషులు 99,557, ఇతరులు 13 మంది కాగా 85.79 శాతంగా నమోదైంది.

గిరిజన తండాల్లో పాదయాత్ర చేసిన జయవీర్

సాగర్ లో జైవీర్ రెడ్డి ఏడాది ముందు నుండే చైతన్య యాత్ర పేరుతో 108 గిరిజన తండాలలో
పర్యటించారు. ఇదే సమయంలోనే బీఆర్ఎస్ అసంతృప్త నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.ఆపనిలో భాగంగానే ఎమ్మెల్యే నోముల భగత్ పై నాన్ లోకల్ ముద్ర వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కానీ,నోముల భగత్ తమ పార్టీ అసంతృప్తులను కాపాడుకొనే పనిలోనే ఉండిపోయారు. ఎమ్మెల్యేగా రెండున్నర ఏళ్ళు అయినా ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలము య్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 2018,2021ఎన్నికల లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అసమయం లో కొంత
వివాదాల్లో చిక్కుకున్నారు. ఇదే అదునుగా భావించిన జైవీర్ రెడ్డి, తండ్రి జానారెడ్డి రాజకీయ అనుభవంతో గులాబీ క్యాడర్ పై దృష్టి పెట్టే పనిలో నిమగ్నమయ్యారు.దాంతో మహిళా ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నట్లు తెలుస్తుంది.

– రాష్ట్రంలో పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్
కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి అందరికంటే ముందే ప్రజల్లోకి వెళ్ళడం, రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ రావడం అడ్వాంటేజ్ గా మారిందని అంటున్నారు. ఇక నోముల భగత్ కు కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో తిరుగుబాటు రావడం, ఎమ్మెల్యేగా సాగర్ అభివృద్ధిపై దృష్టి పెట్టకడం పోవడం, స్థానికుడు కాకపోవడం, సొంత పార్టీ నేతల నుండే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవడం ప్రతికూలంగా మారిందనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 30 నఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికల రోజున నవతెలంగాణ పెద్దవూర మండలం ఓటర్ల పై నిర్వహించారు.ఈసారి సాగర్లో వార్ వన్ సైడ్ అవుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రేస్ అభ్యర్థి జయవీర్ కు నగార్జున సాగర్ మున్సిపాలిటీలో
3500 నుంచి 4000 వేలు, హాలియా మున్సిపాలిటీలో 4000 లవరకు లీడ్ వచ్చే అవకాశం వుంది. అలాగే పెద్దవూర మండలం లో 3500 నుంచి 4000 వేలు లీడ్ నియోజకవర్గం వ్యాతంగా 25,000 ల ఓట్లు పై చిలుకు మెజార్టీ తో గెలువబోతున్నట్లు సర్వేలో తెలిసింది దీనికి గాను దాదాపు ప్రతి మండలం లోఅన్ని విభాగాలకు చెందిన ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుంది. కానీ సాగర్ ఓటర్ల నాడి ఎలావుందో ఉందొ ఈ నెల 3 న తెలియనుంది.

Spread the love