అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన హీరో శివరాజ్‌ కుమార్‌..!

నవతెలంగాణ – హైదరాబాద్: కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆయన ఇటీవలే శివమొగ్గ నియోజకవర్గం నుంచి లోక్‌సభ బరిలోకి దిగిన తన భార్య గీతా శివరాజ్‌ కుమార్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం శివరాజ్‌ కుమార్‌ అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే ఆయన్ని బెంగళూరు నగరంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెగ్యులర్‌ చెకప్‌కోసం మరోసారి ఆస్పత్రికి వెళ్లిన శివరాజ్‌ కుమార్‌.. వైద్యుల సూచనల మేరకు మరోసారి అడ్మిట్‌ అయినట్లు సమాచారం.

Spread the love