భారత్‌లో 3 కోట్ల కార్లను ఉత్పత్తి చేసిన మారుతీ సుజుకి

నవతెలంగాణ – హైదరాబాద్: జపాన్‌కు చెందిన సుజుకి మొటార్ కార్పొరేషన్ కంపెనీ అరుదైన ఘనతను సాధించింది. భారత మార్కెట్లో 3 కోట్ల వాహనాల ఉత్పత్తిని అధిగమించిన రెండో దేశంగా నిలిచినట్టు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వదేశం జపాన్‌లో కంటే వేగంగా ఈ మైలురాయిని భారత్‌లో చేరుకున్నామని తెలిపింది. కంపెనీ అనుబంధ మారుతీ సుజుకి ఇండియా 2024, మార్చి చివరి నాటికి దేశంలో 3 కోట్ల యూనిట్ల ఉత్పత్తిని చేరుకుందని సుజుకి మోటార్స్ పేర్కొంది. ‘జపాన్ తర్వాత ఈ మైలురాయి చేరుకున్న రెండో దేశంగా భారత్ నిలిచింది. 1983, డిసెంబర్‌లో ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి కేవలం 40 సంవత్సరాల 4 నెలల్లోనే 3 కోట్ల యూనిట్ల ఉత్పత్తికి చేరుకున్నాం. జపాన్‌లో ఈ మార్కు చేరేందుకు 55 సంవత్సరాల 2 నెలల సమయం పట్టిందని, భారత్ విషయంలో రికార్డులు నమోదయ్యాయని’ కంపెనీ వివరించింది.

Spread the love