జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

నవతెలంగాణ – హైదరాబాద్: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం ఉదయం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైనట్లు జపాన్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ భూప్రకంపనల ధాటికి జపాన్‌ రాధాని టోక్యో, కాంటో ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. అయితే, ఈ భూప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో జపాన్‌ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్తగా ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను వదిలి వెళ్లాలని ఆదేశించింది.

Spread the love