డే -2 అలరించిన సమ్మర్ క్యాంప్

నవతెలంగాణ-హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ 2 వ రోజు క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇందులో విద్యార్థులను 2 భాగాలుగా విభావించారు. ఒక సెషన్ జూనియర్స్ మరొక సెషన్ సీనియర్స్ సీనియర్స్ కి  మాథ్ మాటిక్స్  ట్రిక్స్  ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనే అంశంపై  టీచర్ చంద్రయ్య గారు 2 గంటలపాటు  క్లాసులు చెప్పారు.  దాదాపు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఉత్సాహపూరితంగా జరిగాయి.  జూనియర్స్ కి టీచర్ పద్మ గారు ఇంగ్లీష్  గ్రామర్ తో పాటు డ్రాయింగ్ క్లాస్ లు నిర్వహించారు. ఇందులో 70 మంది పిల్లలు పాల్గొన్నారు.  ఈ సమ్మర్ క్యాంప్ లో  వాలంటీర్ టీం చాలా అద్భుతంగా పని చేశారు. పిల్లలని ఇన్ టైమ్ కి తీసుకురావాలని తల్లిదండ్రులకు బాలోత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.  బాలోత్సవ్ కమిటీ కార్యదర్శి ఎన్ . సోమయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love