ప్రతి తండాను గ్రామపంచాయతీగా మార్చాం: పోచారం

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలో సోమవారం రాత్రి బి అర్ ఎస్ కార్నర్ మీటింగ్ ముఖ్యఅతిథిగా మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల బరిలో బిజెపి నుండి బీబీ పాటిల్ బడిలో ఉన్నారని ఆయన గత పది సంవత్సరాల నుండి నిజం సాగర్ మండలంకు గాని నిజాంసాగర్ లోని గ్రామాలలోకి గాని వచ్చి చూసింది లేదని ఆయన అన్నారు. ఆయన ఎంపీ అయిన నుండి మండలానికి ఏం కూడా సహాయం చేసింది లేదని ఆయన అన్నారు. అతను పని చెయ్యలేదు కాబట్టే కెసిఆర్ గారు టికెట్ ఇవ్వద్దు అని నిర్ణయించుకున్నాడు అందుకనే అతను రాత్రికి రాత్రే బీజేపీకి చేరాడని ఆయన అన్నాడు అతను కేవలం అతని ఆస్తులు కాపాడుకోవడం కోసమేనని కానీ ప్రజల సమస్యపై అతనికి అవసరం లేదని ఆయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. మా హయాంలో ప్రతి తండాను గ్రామపంచాయతీగా మార్చామని అలాగే ప్రతి తాండ కి కూడా తారు రోడ్డు వేయించామని ఇదంతా కేవలం కేసీఆర్ కృషి అని ఇదంతా కేసిఆర్ కు గ్రామాల్లో మీద ఉన్న ప్రేమనే అని ఆయన కొనియాడారు.  అసెంబ్లీ ఎన్నికలలో తప్పు జరిగిందని అలాంటి తప్పు ఇప్పుడు చేయకూడదని ఆయన అన్నారు. అనంతరం మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ వి అన్ని కూడా ఉత్త మాటలే అని ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి ఏమి కూడా చేయలేదని ఆయన అన్నారు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వలేరని రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి, సొసైటీ చైర్మన్లు  వాజిద్ అలి, నరసింహారెడ్డి, కళ్యాణి విఠల్ రెడ్డి, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love