ప్రధానమంత్రి పర్యటన  పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.. 

– 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
నవతెలంగాణ – వేములవాడ
దేశ ప్రధాని మే 8 పర్యటనలో భాగంగా వేములవాడ పట్టణంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడo జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  తెలిపారు. సోమవారం వేములవాడ పట్టణంలోని మహారాజా గార్డెన్ లో ఏర్పాటు చేసిన బందోబస్తు బ్రీఫింగ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  పాల్గొని అధికారులకు, సిబ్బందికి  పూర్తి వివరాలతో బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..ఈ యొక్క పర్యటనలో భాగంగా దాదాపు 1200 మంది అధికారులు సిబ్బంది పాల్గొననున్నారు. బందోబస్తును 10 సెక్టార్ల గా విభజించి ఎస్పి  అదనపు ఎస్పి స్తాయి అధికారులను బాధ్యులుగా నియమించడం జరిగింది అని తెలిపారు. బందోబస్త్ కి వచ్చిన పోలీస్ అధికారులకు,సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లనే పూర్తి చేసినట్లు తెలిపారు. సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను పూర్తి అప్రమత్తతో ఐడి కార్డులను తప్పనిసరిగా ధరిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. హెలికాప్టర్ వద్ద విధులు నిర్వహించేవారు అలర్ట్ గా ఉండాలని హెలికాప్టర్ వద్దకు  ఎవరిని రానివ్వకూడదని సూచించారు. ప్రతి అధికారి బందోబస్తు కేటాయించిన ప్రాంతం పై పూర్తి అవగాహన, చేయవలసినటువంటి  డ్యూటీ గురించి పూర్తిగా తెలిసి ఉండాలని అన్నారు. డ్యూటీ ప్రదేశం నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళకూడదు అని డ్యూటీ పరంగా లేదా ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు ఎస్.ఐ లు, ఇతర జిల్లా నుంచి వచ్చిన డిఎస్పీలు సి.ఐలు, ఎస్సైలు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love