ప్రధాన వీధిలో ప్రమాదకరంగా మారిన గుంత..

– ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ మెయిన్ రోడ్డు లోని  ప్రధాన దారి రద్దీగా ఉండే రాంమందిరం వీధికి వెళ్లే దారిలో ప్రమాదకరంగా మారిన పెద్ద  గుంత నెలల  నుండి అలాగే ఉంటున్నా అధికారులెవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఈగుంటలో పడి పాదచారులు, ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు పడి దెబ్బలు తాకి గాయాలు కావడం గమనార్హం. బుధవారం రోజున శ్రీరామనవమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల తోపులాటలో భక్తులు ఈ గుంటలో పడిపోవడంతో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలయ్యారు, ప్రమాదాలు జరిగితే స్పందిస్తారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజు  పాదచారులు, ద్విచక్ర వాహన దారులు, కార్లు వెళుతుంటాయి,సోమ, శుక్ర ఆదివారాల్లో దేవాలయం వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఈ గల్లి నుండే ట్రాఫిక్ మళ్లిస్తారు. ప్రమాదకరంగా మారిన గుంత ను ఇప్పటికైనా మున్సిపల్, ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి పట్టణ ప్రజలు, యాత్రీకులు ప్రమాదాల బారిన పడకుండా ఈ గుంత పూడ్చాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Spread the love