ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన మహోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్..

నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో  ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇటిక్యాల వెంకటేష్,కిసాన్ సెల్ అధ్యక్షులు ఇటిక్యాల లింగయ్య,మాజీ సర్పంచ్ లు సర్పంచ్ ఇటిక్యాల నవీన రాజు,ఇటిక్యాల శ్రీనివాస్,సిలువేణి మల్లేశం, ఆరె సంఘ అధ్యక్షులు సిలువేణి తిరుపతి గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love