రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: కేవీపీస్

– 2024  పార్లమెంట్ ఎన్నికల్లో గద్దెదించుదాం..
– ఘనంగా 197 మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి..
ల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నగరాజు..
నవతెలంగాణ – వేములవాడ 
మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతినీ వేములవాడ సీఐటీయూ కార్యాలయంలో  కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం   ఆధ్వర్యంలో  నిర్వహించారు. గురువారం పూలే చిత్రపటానికి పూలమాలవేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవీపీస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు మాట్లాడుతూ.. ఏప్రిల్ 5 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా పూలే అంబేడ్కర్ జన జాతర సదస్సులు సెమినార్లు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. పులే,  అంబేడ్కర్ జయంతి స్ఫూర్తి తో కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని, సామాజిక, న్యాయం కోసం పోరాడుతామని తెలిపారు. భారత రాజ్యాంగంను రద్దు చేయడానికి బిజేపి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. 3000 ఏళ్ల కిందటి మనుస్మృతినీ ప్రాచీన భారత రాజ్యాంగంగా ప్రవేశపెట్టజూస్తుందని మండిపడ్డారు.  స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం సంబంధంలేని జాతీయ జెండాను వ్యతిరేకించి భారత రాజ్యాంగం పనికిరాదని ప్రకటించిన ఆర్ఎస్ఎస్, బిజెపిలు నేటి దేశభక్తి ఫోజు లు కొడుతున్నాయని విమర్శించారు.  నవరత్నాలు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చవుకగా బడా కార్పొరేట్ శక్తులకు బీజేపీ పాలనలో మోడీ అమ్ముతున్నాడని ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేటుపరం చేయడం ద్వారా దళిత గిరిజన బలహీనవర్గాలకు క్రమంగా రిజర్వేషన్లు దూరం అయ్యో ప్రమాదం ఉందని అన్నారు. సామాజిక న్యాయాన్ని సమాధి చేసి మనువాద రాజ్యాంగం అమలుకు మోడీ  సిద్ధపడ్డాడని అన్నారు. దేశంలో 2014 గణాంకాల ప్రకారం 40వేల 172 దాడుల సంఘటన జరిగితే అవి 2021 నాటికి 50 వేల900 లకు పెరిగాయని అన్నారు.  దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోఉన్న రాష్ట్రంలో దళిత యువతి మనిషా వాల్మీకి గ్యాంగ్ రేపుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ బీసీ  కుల గణన ఎందుకు చేపట్టలేదు అని ప్రశ్నించారు.  మహాత్మ జ్యోతిరావు పూలే  పోరాట స్ఫూర్తితో మతోన్మాద బీజేపీ నీ ఓడించాలని లౌకిక ప్రజాస్వామ్య శక్తులను గెలిపించాలని కోరారు. పూలే అంబేడ్కర్ స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం తన తుది శ్వాస వరకు కృషి చేసిన మహనీయుల స్ఫూర్తితో కేంద్రంలోని మతోన్మాద మనువాద బిజెపి దానికి మద్దతు ఇచ్చే పార్టీలను 2024 ఎన్నికల్లో ఓడించాలని తద్వారా రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను బీసీ కులగణనను, ప్రభుత్వ రంగ సంస్థలను, సామాజిక న్యాయాన్ని మతసామరస్యాన్నికాపాడుకోవాలని   పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎగమాంటి ఎల్లారెడ్డి, గురం అశోక్, ఐద్వ జిల్లా కార్యదర్శి జవ్వాజి విమలక్క, వ్యసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ముక్తికాంత అశోక్,  కేవీపీస్ నాయకులు బాబు, శ్రీకాంత్, వెంకటేష్,తదితరులు పాల్గోన్నారు.
Spread the love