సాగునీరు అందించి,  పంటలు ఎండిపోకుండా చూడండి..

– మంత్రి ఉత్తమ్ ను కలిసి స్థానిక పరిస్థితులను వివరించిన ఆది, అడ్లూరి..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించి, రైతులు పండించిన పంటలు ఎండిపోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ప్రభుత్వ విప్ లు,  ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ లు కోరడంతో సానుకూలంగా స్పందించి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కు ఫోన్ చేసిన సీఎం రేవంత్.అనంతరం మంత్రి ఉత్తమ్ ను కలిసి స్థానిక పరిస్థితులను నీటి ఎద్దడిని వివరించిన ఆది, అడ్లూరి.వెంటనే స్పందించిన మంత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి జలాలు వేములవాడ, ధర్మపురి రెండు నియోజకవర్గాలకు తక్షణమే అందేలా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్(సీ.ఈ)ని ఆదేశించిన మంత్రి ఉత్తమ్. సమస్య ఉందని తెలపగానే సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆది, అడ్లూరి.
Spread the love