ఆర్డీవోకు  అవిశ్వాస పత్రాన్ని సమర్పిస్తున్న అర్బన్ మండల ఎంపీటీసీలు

– వైస్ ఎంపీపీ పై  అవిశ్వాసం
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ అర్బన్ మండలం వైస్ ఎంపీపీ పై  అవిశ్వాసానికి ఎంపీటీసీలు మంగళవారం  ఆర్డీవో మధుసూదన్ కు ఫారం -2 అవిశ్వాస పత్రాన్ని అందజేశారు. అర్బన్ మండలంలో ప్రశాంతంగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఒక్కొక్కటిగా ఒక్కొక్కరు బీఆర్ఎస్ కారు దిగి, అధికార పార్టీ హస్తం గూటికి చేరుతున్నారు. గత రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీటీసీగా ఉన్న వనపర్తి దేవరాజ్ బిఆర్ఎస్ వీడి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో అర్బన్ మండలంలోసమీకరణాలు మారాయి. అర్బన్ మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలు కలిగి ఉన్న, ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు సభ్యులు అవిశ్వాసానికి బుర్ర లహరిక – శేఖర్ గౌడ్, బాస రాజశేఖర్, వనపర్తి దేవరాజులు వైస్ ఎంపీపీ రేగులపాటి రవి చందర్ రావుపై అవిశ్వాసానికి తెరలేపారు. కాంగ్రెస్ నుండి ఇద్దరు ఎంపిటిసిలు, బీజేపీ నుండి ఒకరు, మిగతా ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీపీగా బుర్ర వజ్రమ్మ – బాబు, ప్రస్తుత వైస్ ఎంపీపీ రవి చందర్ రావు, గాలిపల్లి సువర్ణ -స్వామి గౌడ్ ఉన్నారు. బీఆర్ఎస్ నుండి   గాలిపల్లి సువర్ణ -స్వామి గౌడ్ సైతం మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న అర్బన్ మండలంలో రాజకీయ వేడి హాట్ టాపిక్ గా మారింది.
Spread the love