గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..

– 5 కిలోల గంజాయి స్వాధీనం…
– అక్రమ రవాణా ,  విక్రయాలు జరిపితే పిడి యాక్ట్..
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..
నవతెలంగాణ – వేములవాడ 
గంజాయి అక్రమ రవాణా,  విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఆదివారం  వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ  అఖిల్ మహజన్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ.. ఒడిస్సా రాష్ట్రం నుండి అక్రమంగా గంజాయి తరలించి వేములవాడ సిరిసిల్ల ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా విలేకరులకు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ (26) అనే యువకుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ పిల్లలతో ఐదు కిలోల గంజాయి తెప్పించాడు అనంతరం వీరి ముగ్గురు  జగధల్పూర్ నుండి ట్రావెల్స్ బస్సు ద్వారా కరీంనగర్ కి అక్కడ నుండి బస్సు లో వేములవాడకు  వచ్చి చింతల్ తానా  శివారుకి వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు  శనివారం రోజున సాయంత్రం  చింతల తానా శివారు ఆర్టీసీ బస్ డిపో దగ్గర లో ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని విచారించగా వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ వ్యక్తుల ద్వారా గంజాయిని ఉత్తర ప్రదేశ్ లోని  జగదల్ పూర్ నుండి తెప్పించి వేములవాడ, సిరిసిల్లలో ముగ్గురూ కలిసి విక్రయించేవారని, సుమారు రూ.1,30,000 రూపాయల విలువ చేసే ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
అనంతరం గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఐడి పార్టీ కానిస్టేబుల్స్ సమీ, గోపాల్, శ్రీనివాస్, ఎస్ఐ అంజయ్య, సీఐ శ్రీనివాస్ లను ఎస్పీ  అభినందించి రివార్డ్ లు అందజేశారు. జిల్లాలో అక్రమ గంజాయి కి సంబంధించిన 14 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్ట్ చేసి సుమారుగా ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేయడం జరిగిందని అన్నారు. తరచుగా జిల్లాలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.జిల్లా పరిధిలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం మెసేజ్ యూవర్ ఎస్పీ నెంబర్ 630-392-2572 కు లేదా డయల్100 కి సమాచారం అందించి, గంజాయి ,మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంమై గంజాయి రహిత జిల్లాగా మార్చాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఇంచార్జ్ సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ అంజయ్య, పోలీస్  సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love