రాముడి పేరుతో బీజేపీ ఓట్ల భిక్షం..

– హామీ ఇచ్చి నెరవేర్చని ఆసమర్థుడు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి..
– ఉత్తర భారతదేశంలో మోడీ గ్రాఫ్ పడిపోతుంది..
– ప్రసాద్ స్కీమ్   వేములవాడ రాజన్న ,కొండగట్టు కు ఎందుకు నిధులు తేలేదు..
– ఆగస్టు 15 లోపు పంట రుణమాఫీ చేస్తాం..
– బీజేపీ, బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభుత్వ విప్ ఆది..
– మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థి  రాజేందర్ రావు..
నవతెలంగాణ – వేములవాడ 
రాముడి పేరు మీద ఓట్లు భిక్షం అడుగుతున్నావు..మేమంతా శ్రీరాముడిని పూజిస్తాం..ఒక బండి సంజయ్ పూజిస్తే శ్రీరాముడిని పూజించినట్టు..మేము పూజించనట్టా కాదా..?ఉత్తర భారతదేశంలో మోడీ గ్రాఫ్ పడిపోతుంది..అక్కడ పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు..మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో గత ముఖ్యమంత్రి  అత్తగారు ఊరు అని ఆరోజు హామీ ఇచ్చి నెరవేర్చని ఆసమర్థుడు బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అని  మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి రాజేందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని వేములవాడలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ సమావేశాన్ని  రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
మండలాల్లో ,గ్రామాల్లో ఎలాంటి వైఖరి ఉండాలి..ఎలా పై చేయి సాధించాలనేది అందరూ ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గా 15 వేల మెజారిటీ తో గెలిచారు..ఈ ఎన్నికల్లో మొత్తం 283 బూత్ లలో మెజారిటీ వచ్చే విధంగా పనిచేయాలని తెలిపారు.బూత్ లలో మెజారిటీ తెచ్చిన వారికి నామినేటెడ్ పదవులు వరిస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  వచ్చిన  తరువాత 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం,500 కి గ్యాస్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్,10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ  ఇస్తున్నామని అన్నారు.ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించాం, ఆగస్టు 15 లోపు పంట రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో గత ముఖ్యమంత్రి  అత్తగారు ఊరు అని ఆరోజు హామీ ఇచ్చి నెరవేర్చని ఆసమర్థుడు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కి రావాల్సిన టెక్స్ టైల్ పార్కు వరంగల్ కి తరలించిన అసమర్థుడు వినోద్ కుమార్.నీది వరంగల్ అని టెక్స్ టైల్ పార్కు అక్కడికి తరలించారా..మీరు కూడా  అక్కడికి వెల్లు.. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు వినోద్ కుమార్ కి ఓటు అడిగే హక్కు లేదు అని అన్నారు.కవిత అరెస్టు పై డ్రామా ఆడుతున్నారు. అందరూ బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తున్నారు అని కార్యకర్తలకు సూచించారు.
ఉత్తర భారతదేశంలో మోడీ గ్రాఫ్ పడిపోతుంది,అక్కడ పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు అని అన్నారు. రాముడి పేరు మీద ఓట్లు భిక్షం అడుగుతున్నావు,ఒక బండి సంజయ్ పూజిస్తే శ్రీరాముడిని పూజించినట్టు .మేము పూజించనట్టా కాదా..అక్షింతల పేరుతో రాజకీయం చేస్తున్నారు.నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో తెలంగాణ కి ఎం ఇచ్చారో చెప్పు, 10 సంవత్సరాల్లో ఏం చేశారు ఫెడరల్ సిస్టం గా వచ్చేవి కాకుండా.. ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గంకి ఏమైనా తెచ్చారా,బండి సంజయ్ మీరు ఏం తెచ్చారు అని ప్రశ్నించారు.ప్రసాద్ స్కీమ్ ద్వారా జోగులాంబ టెంపుల్ కి నిధులు వచ్చాయి.. మరి వేములవాడ రాజన్న ,కొండగట్టు అంజన్న కు  ఎందుకు నిధులు తేలేదు.. బండి సంజయ్ చెప్పాలి.ఈ 5 సంవత్సరాలు బండి సంజయ్ మీ ఉర్లోకి ఎన్నిసార్లు వచ్చారు.నేను ఎంపిగా ఉన్నప్పుడు తిరగని ఊరు లేదు .. తిరగని మండలం లేదు..
ఎక్కడైనా రైతులు ఇబ్బందులు పడితే.. రైతుల  కల్లాల దగ్గరకు వెళ్లవా..పరామర్షించావా బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏడాది కి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి..నల్లధనం తెస్తా 15 లక్షలు వేస్తా అన్నాడు..వేశారా.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు మాట నిలబెట్టుకొని ప్రధాని అని ఎద్దేవా చేశారు. నఫరత్ చోడో… మొహబ్బత్ జోడో అని రాహుల్ గాంధీ దేశమంతా యాత్ర చేపట్టారు. మోడీ తెలంగాణ ఏర్పాటు ను అవమనపరిచాడు, అర్ధరాత్రి తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని అమరవీరులకు అవమాన పరిచారు,అలాంటి వారికి ఓటు వేద్దామా.గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలకు రావాలి అని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కృషి తోనే అసెంబ్లీ ఎన్నికల్లో  గెలిచాను,ధనవంతులు, పెట్టుబడిదారులు డబ్బుల వర్షం కురిపించిన లొంగిపోకుండా, వెనకడుగు వేయకుండా నా గెలుపుకు కృషి చేయడంలో పార్టీ సభ్యులందరి కృషి మరవలేనిది అని కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.అసెంబ్లీ ఎన్నికలే స్పూర్తిగా తీసుకుని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మన  అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలి కార్యకర్తకు పిలుపునిచ్చారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6గ్యారెంటీలు అమలు జరుగుతుంది, ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం కొనసాగించాలి తెలిపారు. వేములవాడ నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎల్లంపల్లి పనులు ప్రారంభం కాబోతున్నాయి అని తెలిపారు.మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం, తాను కలిసి ఇప్పటికే సీఎంతో చర్చించడం జరిగింది,పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు యువతకు ఉపాధి  కల్పించే అంశాలపై చర్చించడం జరిగింది అని తెలిపారు, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. రాబోయే రోజుల్లో  బిఆర్ఎస్ కనిపించదు…ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు.స్థానిక ఎంపీ బండి సంజయ్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి కార్యకర్తలకు సూచించారు. మతాన్ని అడ్డుపెట్టుకొని జై శ్రీ రామ్  నినాదాన్ని ఎన్నికల ముందు తెస్తున్నారు. శ్రీ రాముడు అందరి వాడు, ఆదర్శ మూర్తి, తాతా ముత్తాతల నుండి శ్రీ రామనవమి జరుగుతుంది, బీజేపీ ఎప్పుడు పుట్టింది…? అయోధ్య రామాలయం ప్రారంభం కాకముందే అక్షింతలు పంపించారు..ఇది కేవలం ఎన్నికల్లో గెలుపు కొరకే మోదీ గెలుపు సాధ్యం కాదని తెలిసే హిందు నినాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు కార్యకర్తలు గ్రహించి ఉండాలని అన్నారు.ప్రపంచంలో ఏకైక లౌకిక దేశం  భారతదేశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే దేశం అభివృద్ధి, సంక్షేమం సాధ్యంపార్లమెంట్ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం కీలక పాత్ర పోషించాలి, భారీ మెజారిటీ అందించి, అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి కార్యకర్తలకు సూచించారు.
చివరిగా కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ..
బండికి జ్ఞానం.. విజ్ఞానం.. పరిజ్ఞానం ఏదీ లేదు.. టీచర్లు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తే.. మరి కాంట్రాక్టర్లు ఏ శాఖలో పనిచేస్తారు ఎద్దేవా చేశారు.- బై బై బండి.. బై బై మోడీ నినాదంతో బీజేపీని బొంద పెడదాం అని కార్యకర్తలకు సూచించారు. బండి సంజయ్ కి లోకజ్ఞానం.. విద్యా విజ్ఞానం.. విషయ పరిజ్ఞానంలో ఏ ఒకటి లేదని అటువంటి వ్యక్తిని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తాడని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి  వెలిచాల  విమర్శించారు. బీఎస్ఆర్ అటావ్ తెలంగాణ బచావో నినాదంతో మూడు నెలల క్రితం గులాబీ పార్టీని బొంద పెట్టామని.. బిజెపి హటావో భారత్ బచావో నినాదాన్ని ముందు వేసుకొని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కమలం పార్టీని కూడా బొంద పెట్టాలని, తద్వారా రాహుల్ గాంధీని ప్రధాని చేసే బాధ్యత చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడి తల ప్రణవ్ మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ ఇతర ముఖ్య నేతలు వేములవాడ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love