వైకుంఠధామం ప్రారంభం

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెల్లడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, నిరంతరం శ్రామికుడీనై, నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తా అనీ ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల పథకాల వల్ల అభివృద్ధి, అన్ని వర్గాలలో జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. త్వరలోనే మిగిలిన అన్ని రకాల హామీలను అమలు చేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు, తులం బంగారం కూడా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, దీనివలన పెళ్లిరోజు ఈ పథకం వర్తింపచేసేలా కార్యచరణ కూడా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మల్లికార్జున్ వడ్డేపల్లి సర్పంచ్ సంధ్యారాణి, ప్రజాపండరి వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love