నవతెలంగాణ – కాబూల్: అఫ్గానిస్థాన్‌లో శనివారం సంభవించిన భారీ భూకంపం ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ శిథిలాన్ని తొలగిస్తే ఎన్ని శవాలు బయటపడతాయోనని సహాయ బృందాలు భయపడుతున్నాయి. ఇప్పటివరకు 2,445 మంది మరణించారని, మరో 2 వేల గాయపడ్డారని అఫ్గాన్ విపత్తుల మంత్రిత్వశాఖ ప్రతినిధి జనన్ సయీక్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. సుమారు డజన్ సహాయ బృందాలతో పాటు, మిలటరీ, రెడ్ క్రీసెంట్ లాంటి ఎన్జీవోలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయని చెప్పారు.