ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు .. మార్గదర్శకాలు

మార్గదర్శకాలు ఇవే
మార్గదర్శకాలు ఇవే
– 5 వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
– సెప్టెంబర్ 1 నాటికి రెండేండ్ల సర్వీసు ఉన్నోళ్లే అర్హులు
– టీచర్లు 8 ఏండ్లు, హెచ్ఎంలు 5 ఏండ్లు పనిచేస్తే బదిలీ తప్పనిసరి
– మార్గదర్శకాలు, షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈనెల ఐదో తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు షెడ్యూల్, మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను శుక్రవారం విడుదల చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్గా పదోన్నతుల ప్రక్రియను చేపడతా మని తెలిపారు. కేటగిరీ వారీగా ఖాళీలు, ప్రధానోపాధ్యా యుల పదోన్నతులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితాలు ఆన్లైన్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యా యులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎంఈవోలకు, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోలకు ఈనెల మూడు నుంచి ఐదో తేదీలోపు సమర్పించాలని తెలిపారు.
ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలు:
» ఒకే పాఠశాలలో సెప్టెంబర్ ఒకటి నాటికి కనీసం రెండేండ్లు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసేందుకు అర్హులు..
» ఒకే పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంలు ఐదేండ్లపాటు మిగతా ఉపాధ్యాయులు ఎనిమిదేండ్లు పనిచేస్తే బదిలీ తప్పనిసరిగా అవుతారు.
ఉద్యోగ విరమణకు మూడేండ్లలోపు సర్వీసు ఉన్న వారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ వారి ఇష్ట ప్రకారం బదిలీ ఉంటుంది.
» అన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈనెల 3 నుంచి 5 వరకు స్వీకరిస్తారు.
» స్పౌజ్, వికలాంగులు, పెండ్లికానివారు, వితంతువులకు 10. పాయింట్లు అదనంగా ఉంటాయి.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తిస్తుంది.
» ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పాంజ్ పాయింట్లు వర్తిస్తాయి.
» ప్రధానోపాధ్యాయులకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరుగుతాయి.
» 8,9 తేదీల్లో సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
* 15న గ్రేడ్ -2 హెచ్ఎంల బదిలీలు చేపడతారు.
» 17 నుంచి 19 వరకు ఎస్ఏలకు హెచ్ఎం పదోన్నతులు నిర్వహిస్తారు.
» 20,21 తేదీల్లో ఎస్ఏల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఉంటాయి,
* 23,24 తేదీల్లో ఎస్ఏల బదిలీలుంటాయి.
» 26 నుంచి 28 వరకు ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతులు వస్తాయి.
» 29 నుంచి అక్టోబర్ 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు చేపడతారు.
» వచ్చేనెల 3న ఎస్జీటీల బదిలీలు నిర్వహిస్తారు.
» వచ్చేనెల 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం ఉంటుంది.
Spread the love