మొరాకో భూకంపం.. 2వేలకు చేరిన మృతుల సంఖ్య

నవతెవలంగాణ – మొరాకో: ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోను  భూకంపం కకావికలం చేసింది. పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్‌ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతిచెందారు. మరో 2,059 మంది గాయపడ్డారు. దేశంలో గత ఆరు దశాబ్దాల్లో సంభవించిన అతిపెద్ద విపత్తు ఇదేనని అధికారులు తెలిపారు. మరకేష్‌-సఫి ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టాలు అధికంగా ఉన్నాయి. దాదాపు 45 లక్షల మంది ప్రభావితులయ్యారు.

Spread the love