మరోసారి అఫ్ఘానిస్థాన్‌లో భూకంపం..

నవతెలంగాణ – కాబూల్‌: ఇటీవల వరుస భూకంపాలతో దద్ధరిల్లిన అఫ్ఘానిస్థాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. హెరాత్ నగరానికి 29 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే కొన్ని గంటల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాలు అఫ్ఘానిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. భూకంప ప్రాంతాల్లో భారీ భవనాలు కుప్పకూలడంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Spread the love