నవతెలంగాణ -టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. రాజధాని టోక్యోకు 1,488 కిలోమీటర్ల ఈశాన్యంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిన ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 3.49 నిమిషాలకు ఈ భూకంపం చోటుచేసుకుంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. అయితే ఈ భూకంపం వల్ల ఏమైనా మరణాలు సంభవించాయా..? అనేది ఇప్పటివరకు వెల్లడికాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.