కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు..

 – కల్లబొల్లి మాటలు నమ్మొద్దు..
 – కాంగ్రెస్ కు ఓటేస్తే దళితబంధు పథకం బంద్..
 – బోనమేత్తిన బాజిరెడ్డి గోవర్ధన్..
 – ప్రచారం లో జనం జేజేలు..
నవతెలంగాణ డిచ్ పల్లి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు మొదలౌతుందని, ప్రతి పక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మొద్దని, కాంగ్రెస్ కు ఓటేస్తే దళితబంధు పథకం బంద్ అవుతుందని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కెసిఆర్ అని, ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ సాధన కోసం మారుమూల గ్రామమైన కోరట్పల్లి ముందుందని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కోరట్ పల్లి,కోరట్ పల్లి తండా, సుద్దులం, లింగసముద్రం, యానంపల్లి తండా, మిట్టాపల్లి తండా, సాంపల్లి తండా, సాంపల్లి, సుద్దపల్లి, దేవపల్లి, దేవానగర్, ఒడ్డెరకాలనీ, అమృతాపూర్ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. గంగాధర్ గౌడ్ తోకలిసి ఎన్నికల ప్రచారంలో బాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం ప్రకటించిన తర్వాత అమరుల త్యాగాలకు
గుర్తుగా కోరట్పల్లి గ్రామంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారని, ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే అభివృద్ధి విషయంలో నిలదీయాలని, వారి మాటలు నమ్మితే ప్రజలు మోసపోతారని, గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ను చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నిరుపేద దళిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును అమలు చేస్తే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు అట్టి పథకాలను ఆపాలని ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేసి దళితబంధు పథకాలు రాకుండా చేశారని విమర్శించారు. ఎంపీగా గెలిపిస్తే నెల రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసిచ్చిన ఎంపీ అరవింద్ ఐదేళ్లు గడిచిన పసుపు బోర్డు తేలేదని వారికి ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. గత కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని 45 ఏళ్లు పాలించారని, అప్పట్లో కరెంట్ 4-5 గంటలు మాత్రమే ఇచ్చేవారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ రెండు పంటలకు నీరు ఇస్తున్న ఘనత సిఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో బీడీ పింఛన్ రాని బీడీ కార్మికులకు సిఎం కేసీఆర్ కటాప్ డేట్ను ఎత్తివేశారని, డిసెంబర్ 5 తర్వాత బీడీ కార్మికులందరికీ పింఛన్లు రానున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని తెల్ల రేషన్కార్డు కలిగిన వారికి కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేసేందుకు సీఎం ప్రత్యేక మెనిఫెస్టోలో ప్రకటించారన్నారు. ప్రజలు పని చేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని, మోసపూరిత కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటు వేస్తే మనం ఆగమైపోవల్సి వస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ జుటా మాటలు నమ్మితే ఉన్నది పోతది ఉంచుకున్నది పోతదని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. కోరట్పల్లి గ్రామానికి బైపాస్ రోడ్డు, డబుల్ రోడ్డు కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. అనంతరం సుద్దులం గ్రామంలో జరిగిన ప్రచారంలో బాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటేస్తే దళితబంధు పథకం రాదని, గ్రామంలో అర్హులైన వారందరికీ విడతల వారిగా దళితబంధును ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కోరట్పల్లి గ్రామంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళహారతులు, బోనాలతో బాజిరెడ్డి గోవర్ధనక్కు మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించి పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ రూరల్ ఇన్చార్జివి. గంగాధర్ గౌడ్, మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్ నారాయణరెడ్డి, నాయకులు దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, సర్పంచ్లు నీరడి సుజన, అరుణ మహిపాల్, వెంకటేష్, నీల బలరాం,మోహన్రెడ్డి, సంతోష్, యూసుఫ్, నాయకులు నవీన్ రెడ్డి, పద్మారావు, మోహమ్మద్ యూసుఫ్,కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్,లక్ష్మీనారాయణ, షేక్ బాబు, లొక్కిడి ఆశన్న, మోహన్రెడ్డి, జగదీష్, దండుగుల సాయిలు, గీత, చిరంజీవి, ప్రభాకర్, నవీన్రెడ్డి, జైపాల్, శేఖర్రెడ్డి తదితరులున్నారు.
Spread the love