పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

– ఐసిడిఎస్ సూపర్ వైజర్: వాణి
నవతెలంగాణ- నసురుల్లాబాద్
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని రక్తహీనతను అధిగమించేందుకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్ వైజర్ వాణి, బుదవారం నసురుల్లాబాద్ మండల పరిధిలోని స్థానిక అంగన్ వాడి కేంద్రంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్ వాడి టీచర్స్ లకు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ వాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరు చదివినియోగం చేసుకోవాలన్నారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మి, అమలు అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చంటి పిల్లలు కు పోస్టుకాహారం అందించాలన్నారు. ఇంటింటికి వెళ్లి చంటి పిల్లల బాలింతల సర్వే నిర్వహించాలన్నారు. రక్తహీనత బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని ఆమె సూచించారు. ప్రతి అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థుల హాజరు ఎప్పటికప్పుడు అన్ లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు

Spread the love