ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట పట్టణంలోని కాకతీయ టెక్నో స్కూల్ లో,  జిల్లా వైద్య అధికారి కాశీనాథ్, త్రీ టౌన్ సిఐ భాను ప్రకాష్ కు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాఖీలు కట్టి ముందస్తుగా రాఖి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రెడ్డమైన అరవింద్ మాట్లాడుతూ బంధాలు పంచే రాఖి బంధన్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. మండల విద్యాధికారి యాదవ రెడ్డి,  ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గు మల్లారెడ్డి లు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల, అన్నదమ్ముల ప్రేమకు, అనురాగానికి, ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ఒకరికి ఒకరు, తోడుగా నిలిచి, సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.  నీవు నాకు రక్ష,  నేను నీకు రక్ష,  మనందరం దేశానికి రక్ష అనే నినాదంతో అక్క చెల్లెలు, అన్నదమ్ములు మెలగాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సంజు కుమార్, సంతోష్,  నాయకులు నేహా, చందన, హరీష, అంజలి తదితరులు పాల్గొన్నారు.
Spread the love