నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు

– టీఎస్ సీడ్స్ మేనేజర్ కోటిలింగం 
– టీ రైతులకు టీఎస్ సీడ్స్ ద్వారా విత్తనాలు
నవతెలంగాణ-బెజ్జంకి
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు సమకూరుతాయని..తెలంగాణ రైతాంగం నకిలీ విత్తనాల బారినపడి నష్ట పోకుండా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తోందని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ కోటిలింగం సూచించారు.గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద తెలంగాణ విత్తన రథం ద్వారా నాణ్యమైన వరి, శనగ, తదితర విత్తనాలపై రైతాంగానికి కోటిలింగం అవగాహన కల్పించారు.విత్తనాలు అవసరమగు రైతులు పీఏసీఎస్,ఆగ్రోస్ తదితర కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు.రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే వాడాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించి రైతులకు మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని దళారులకు రీజినల్ మేనేజర్ హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ వాసు,బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love