అన్న, చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ 

పాఠశాలల్లో ముందస్తు రక్షబంధన్ వేడుకలు
నవతెలంగాణ-గంగాధర
గంగాధర మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో బుధవారం విద్యార్థులకు, తోటి విద్యార్థినులు రాఖీలు కట్టి ముందస్తు రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. అన్న, చెల్లెలు, అక్క, తమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు కన్నుల పండువగా విద్యార్థిని, విద్యార్థులు జరుపుకున్నారు.  గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని నరేంద్ర విద్యాలయం ఆవరణలో విద్యార్థిని,  విద్యార్థులు రంగు రంగుల దుస్తులను ధరించి రాఖీ అకృతిలో కూర్చుని ముందస్తు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు మధురానగర్ లోని సాయి విన్నర్స్ పాఠశాలలో విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి బాంధవ్యాన్ని చాటుకున్నారు.
Spread the love