అంబాల్ పూర్  లో హోమియోపతి వైద్య శిబిరం

నవతెలంగాణ- శంకరపట్నం
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలతో  సీజనల్ వ్యాధులపై బుధవారం మండలంలోని అంబాలాపూర్ గ్రామంలో ఆయుష్ డా. సి.సంధ్యా రాణి ఆధ్వర్యంలో హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ముంజ వసంత వెంకటేశం  హాజరయ్యారు. జ్వరము, జలుబు, దగ్గు, అతిసారం, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు, జీర్ణాశయ సమస్యలు వంటి వ్యాధులను గుర్తించి 148 మంది రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
ఫార్మాసిస్ట్ అర్చన, ఏఎన్ఎం కనకలక్ష్మి, ఆశా వర్కర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love