మూడో విడత పోలింగ్‌..రెండు గంటల్లో పది శాతం

నవతెలంగాణ-హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ విడుతలో 11 రాష్ర్టాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17.24 కోట్ల మంది ఓట్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇక పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలో మొత్తం 10.57 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. ఇక అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 14.60 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. అస్సాంలో 10.12 శాతం, బీహార్‌లో 10.03 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 13.24 శాతం, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూలో 10.13 శాతం, గోవాలో 12.35 శాతం, గుజరాత్‌లో 9.87 శాతం, కర్ణాటకలో 9.45 శాతం, మధ్య ప్రదేశ్‌లో 14.22 శాతం, మహారాష్ట్రలో 6.64 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 11.63 శాతం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 14.60 శాతం మేర పోలింగ్‌ నమోదైంది.

Spread the love