– అభివృద్ధికి నిలువెత్తు రూపం ఎమ్మెల్యే మెచ్చా..
– అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన తపన..
– విలేకర్ల సమావేశంలో ఎం.పి.పి శ్రీరామమూర్తి,బండి పుల్లారావు ,యు.ఎస్ ప్రకాశ్ లు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యా, వైద్యం, పట్టణీకరణకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, దానికి అనుగుణంగా నియోజక వర్గంలోని అన్ని మండలాలకు ప్రాధాన్యతనిస్తూ స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అభివృద్ది పదం లో పాలన చేస్తున్నారని స్థానిక ఎం.పి.పి శ్రీరామమూర్తి,బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి యు.ఎస్ ప్రకాశ్ రావు,మండల అద్యక్షులు బండి పుల్లారావు లు మెచ్చా సేవలను కొనియాడారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం.పి.పి ఛాంబర్ లో బి.ఆర్.ఎస్ మండల నాయకులు బుధవారం విలేకర్లు సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు శ్రీ మెచ్చా నాగేశ్వర రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సాధించినా మరో అద్భుత ఘట్టం అశ్వారావుపేట కు 100 పడకల ఆసుపత్రి మంజూరీ జీవో ను నిన్న సీఎం కెసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు అందుకున్నారని, అశ్వారావుపేట అభివృద్ధిలో మరో బలమైన పునాది వేసిన నాయకుడుగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు నిలుస్తున్నారని, అలాగే హైదరాబాద్ వెళ్ళిన ప్రతి సారి ఎమ్మెల్యే గారు ఎదో ఒక అభివృద్ధికి సంబంధించి జీవో లని తీసుకొని వస్తారని మెచ్చా మాటల మనిషి కాదని చేతల మనిషి అని మరోసారి రుజువు చేశారని అన్నారు.అశ్వారావుపేట మండల ప్రజల చిరకాల కోరిక సెంట్రల్ లైటింగ్ ను మంజూరు చేపించారని, వెంటనే పనులను కూడా ప్రారంభించారని, అలాగే అశ్వారావుపేట లో విద్యార్థుల కొరకు డిగ్రీ కాలేజీ మంజూరీ జీవో నీ తీసుకోవడమే కాకుండా నూతన అడ్మిషన్ లను కూడా ప్రారంభించారని, ఇంకా ముందు ముందు మరింత అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తారని,ప్రతి పేదవాడికి కావలసిన ప్రధాన అంశాలు విద్యా మరియు వైద్యం ఆని ఈ రెండిటినీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ప్రజల అవసరాల దృష్ట్యా మంజూరు, డిగ్రీ కాలేజీ లో తాత్కాలికంగా జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు, కావున విద్యార్థులు డిగ్రీ విద్యా కొరకు దోస్త్ లో అప్లయ్ చేసుకోవాలని వారు తెలియజేశారు. అశ్వారావుపేట కు 100 పడకల ఆసుపత్రి నీ మంజూరీ చేసినందుకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు కు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు కు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ,మండల నాయకులు తాడేపల్లి రవి,పేరాయిగూడెం పార్టీ ప్రెసిడెంట్ చిప్పనపల్లి బజారయ్యా, గుమ్మడివల్లి ఎంపిటిసి తిరుపతి రావు, మవిళ్ళవారిగూడెం పార్టి ప్రెసిడెంట్ రామినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.