ఆశావాహులు ఎందరు ఉన్నా.. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

– అన్నీ సీట్లు మేమే గెలుస్తాం మీ…
– కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ ప్రభుత్వం తన పోలీస్,రావాణా బలగాలను ఉపయోగించి ఖమ్మం సభను నిర్వీర్యం చేయాలని చూసినప్పటికీ వాటిని అధిగమించిన కాంగ్రెస్ శ్రేణులు ఎవరి దారిలో వారు,ఏదో ఒక వాహనంలో సభకు చేరుకుని విజయవంతం చేయడంతో మా పార్టీ నాయకులకు మనోధైర్యం కలిగిందని,ఈ ఊపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లలో మేమే విజయం సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే,పీసీసీ నాయకులు తాటి వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేసారు.  జన గర్జన విజయవంతం అయిన నేపధ్యంలో మంగళవారం స్థానిక సీనియర్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఆయన పార్టీ శ్రేణులకు అభినందనలు,కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలు పేరుతో పార్టీ ప్రచారం చేసుకోవడానికి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రజా ధనాన్ని లూఠీ చేసారని  ఆరోపించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కట్టని కోట లాంటిదని హర్షం వ్యక్తం చేసారు.పార్టీలో ఎందరు ఆశావాహులు ఉన్నా అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్.పి.టీ.సీ సభ్యులు అంకత మల్లికార్జున రావు,మాజీ సర్పంచ్ పొట్టా రాజులు,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,పార్ధసారధి,బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love