నవతెలంగాణ – అశ్వారావుపేట
భూమి లేని నిరుపేదలకు భూమి దక్కాలని, కూలీ రైతాంగ సమస్యలుపై అలుపెరుగని పోరాట చేసిన ధన్యజీవి కామ్రేడ్ దానపు మునియ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. పుల్లయ్య అన్నారు. బుధవారం వినాయకపురం లో చిరంజీవి అధ్యక్షతన దానపు మునెయ్య సంతపసభ జరిగింది.ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ సాధారణ సభ్యుడు స్థాయి నుండి పార్టీ ఇచ్చిన సహకారం తో అనతికాలంలోనే మండలంలో ప్రజలు గుర్తించిన నాయకుడిగా ఎదిగారు అని అన్నారు.గిరిజన హక్కుల పరిరక్షణ కోసం,పోడు భూములకు పట్టాలు సాధనకోసం ప్రజలను సమీకరించి అలుపెరగని పోరాటాలు నిర్వహించటం లో తన పాత్ర ఉందని అన్నారు. పార్టీ కి వెన్నుముక గా,ప్రజల్లో తల్లో నాలుక లా వున్న కామ్రేడ్ మునియ్య మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ,కలపాల భద్రం, తగరం నిర్మల, సూరిబాబు, మడకం గోవిందరావు, తగరం జగన్నాథం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.