అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న జీపీ కార్మికులు

– వారం పూర్తైన జీపీ కార్మికుల సమ్మె..
– అర్ధనగ్న ప్రదర్శన
–  జారే సంఘీభావం..
నవతెలంగాణ – అశ్వారావుపేట: జీపీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి వారం రోజులు పూర్తైంది. ఈ సందర్భంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ కార్మికులు నిరసన చేపట్టారు.ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు జారే ఆదినారాయణ తన అనుచర గణంతో సమ్మె శిభిరం చేరుకుని సంఘీభావం ప్రకటిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్,స్థానిక నాయకులు అప్పన్న, కామేశ్వరరావు, కేసుపాక నరసింహారావు, అప్పారావు, కాంగ్రెస్ నాయకులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, జూపల్లి రమేష్, అంకత మల్లికార్జున్ రావు, పొట్టా రాజులు, వేముల భారతి ప్రతాప్, సత్యవరపు తిరుమల బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love