– త్వరితగతిన పనులను పూర్తి చేయండి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయిల్ఫైడ్ ఎండీ సురేందర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. నాణ్యతలో ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో బుధవారం పర్యటించిన ఆయన అభివృద్ధి పనుల నాణ్యతను తనిఖీ చేశారు. దమ్మపేట మండలం అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీ విస్తరణ పనులతో పాటు వారంవారిగూడెంలో నిర్మింస్తున్న అతిథి గృహం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా నర్సరీలో మొక్కల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొక్కలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి, పి అండ్ పి మేనేజర్ శ్రీ కాంత్ రెడ్డి, అయిల్ఫెడ్ డివిజనల్ మేనేజర్ ఆకుల బాలకృష్ణ, అదనపు మేనేజర్ నాగబాబు, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్, తదితరులు అన్నారు.