ఆర్ఒఎఫ్ఆర్ సర్వే అవకతవకలు సరి చేయాలి: సీపీఐ ఎంఎల్ ప్రజా పంధా

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని బచ్చువారి గూడెం పంచాయతీ‌ జెట్టివారి గూడెం, చిచ్చొడిగుంపు అదివాసీల పోడుభూముల సర్వే జరిగిన అవకతవకల సరి చేయాలని సి పి ఐ ( యం యల్ ) ప్రజాపంథా ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ లూదర్ విల్సన, ఎంపీడీవో శ్రీనివాస్ రావు లకు బుధవారం వినతి పత్రాలు అందజేసారు. బచ్చువారి గూడెం జిపి పరిధిలోని జెట్టివారి గుంపు, చిచ్చుడిగుంపు ఆర్ ఓ ఎప్ ఆర్ కమిటీల పరిధిలోని మిరియాల సీతాదేవి, కుర్సం చిన్నక్క, జెట్టి భద్రమ్మ, జెట్టి నాంచరమ్మ, జెట్టి మరయ్య, జెట్టి కృష్ణారావు, మొత్తం 6 మంది పోడు భూమి 15 ఎకరాలు గత 20 సంవత్సరములు గా సాగు చేసుకుంటు జీవిస్తున్నారని పార్టీ జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్ అన్నారు. పోడు భూముల సర్వే సందర్భంలో స్థానిక సర్పంచ్ కుంజ గంగాభవాని, కార్యధర్శి రవి, బీట్ ఆఫీసర్ నరసింహరావు,ఆర్ఓఎఫ్ఆర్ కమిటీ చైర్మన్ జెట్టి సీతాదేవి మరి కొందరు గ్రామ పెద్దలు కుమ్మకై ఆరుగురు సాగు చేస్తున్న పోడు భూమిని సాగులో లేని 50 మందికి సర్వే చేయటం సరైంది కాదని ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో జరగటాన్ని సి పి ఐ యం ఎల్ ప్రజాపంథా తీవ్రంగా కండి స్తుంది అని తెలిపారు. ఇదే పంచాయితి పరిధిలోని రేగడి అనే ఆదివాసి గ్రామంలో 42 కుంటుబాలకు పోడు భూమి పట్టాలు ఇప్పిస్తా మని రూ.1 లక్షా 40 వేలు వసూలు చేసారని ఆరోపించారు. పై రెండు విషయాలపై అధికారులు విచారించి తగు చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంగాల కల్లయ్య, వాసం బుచ్చిరాజులు పాల్గొన్నారు.

Spread the love