– డిజిటల్ కలర్ బోర్డ్ లు
– సాంకేతికత బోధన
– కార్పోరేట్ బడులను తలపిస్తున్న మన ఊరు మన బడులు
– డిజిటల్ బోధనకు రూ.7 కోట్లు వ్యయం
– నాణ్యమైన విద్యే లక్ష్యం – ఎస్.కె సైదులు,సి.ఎం.ఒ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆలోచన సాకారం అయితేనే ఆచరణ సాధ్యం అవుతుంది.ఆచరణాత్మక విధానమే విప్లవానికి నాంది పలుకుతుంది.దీంతోనే సమాజం సమగ్ర అభివృద్ది సాధ్యం అవుతుంది. ఒకపుడు పాఠశాల అంటే బ్లాక్ బోర్డ్,చాలీచాలని బల్లలు,అరకొర అసౌకర్యాలు నడుమ విద్యాబోధన ఉండేది.నేడు ప్రభుత్వాలు సైతం, మారుతున్న సాంకేతికత అనుగుణంగా విద్యాభివృద్ధి పై దృష్టి సారిస్తున్నాయి.ఎందుకంటే భావిభారత సమాజం బడుల్లో నే రూపొందుతుంది కాబట్టి.ఆ దిశగా పాలకులు ఆలోచన చేయడం హర్షించతగ్గ ఆశయం మే. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు – మన బడి పధకంలో ఊరు బడుల భవనాలను పునరుద్ధరించడమే కాకుండా,అందులో నేటి సాంకేతికాభివృద్దితో విద్యార్ధులకు సౌకర్యాలు,బోధనలో సాంకేతికత జోడించడం తో ప్రైవేటు,కార్పోరేట్ పాఠశాలలను తలదన్నేలా రూపొందుతున్నాయి అనడంలో సందేహం లేనే లేదు. ఈ పధకం లో జిల్లా లో 22 మండలాల్లో ప్రారంభించిన 65 పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యాబోధన కు అవసరం అయిన సామాగ్రి ని రూ.6 కోట్ల,77 లక్షల,71 వేల,648 లతో అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల 75 వేల విలువ చేసే 75 అంగుళాల 03 ఐ.ఎఫ్.పి (ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ – డిజిటల్ కలర్ బోర్డ్ లు,రూ.26 వేల 2 కేవీ యు.పి.ఎస్ ఒకటి,రూ.32 వేల ఎక్సైడ్ బ్యాటరీస్ ఆరు,రూ.08 వేలు తో విద్యుదీకరణ,రూ.11 వేలు తో నెట్ వర్కింగ్ అనుసంధానం తో మొత్తం ఒక్కో పాఠశాల కు రూ.11 లక్షలు వ్యయం చేసారు.
మొత్తం మండలాలు 22
మండలం పాఠశాలలు
1)పాల్వంచ 07
2)దమ్మపేట 06
3)భూర్గం పాడు 05
4)ఇల్లందు 04
5)టేకులపల్లి 04
6)కొత్తగూడెం 04
7)కరకగూడెం 03
8)చర్ల 03
9)అశ్వాపురం 03
10)జూలూర్ పాడు 03
11)చుంచుపల్లి 03
12)లక్ష్మిదేవిపల్లి 03
13)అశ్వారావుపేట 03
14)పినపాక 02
15)మణుగూరు 02
16)చండ్రుగొండ 02
17)అన్నపురెడ్డిపల్లి 02
18)సుజాత నగర్ 02
19)దుమ్ముగూడెం 01
20)ఆల్లపల్లి 01
21)గుండాల 01
22)ములకలపల్లి 01
ఎస్.కే సైదులు,సి.ఎం.ఒ:
సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ విధానంలో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం. సాంకేతిక బోధన అభ్యసనం సజావుగా సాగడానికి ప్రతీ పాఠశాలకు ఇరువురు ఉపాధ్యాయులకు ఈ విధానం పై శిక్షణ ఇచ్చారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరగుతుంది.భవిష్యత్తులో మిగిలిన అన్ని ఉన్నత పాఠశాలల్లో నూ ఈ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
బోధన సులభతరం – కే.అప్పారావు,ఎస్.ఎ(ఫిజికల్ సైన్స్):
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐ.ఎఫ్.పి) ద్వారా ఉపాద్యాయులు చాక్ పీస్ అవసరం లేకుండానే స్టైల్స్ పెన్ ఉపయోగించి స్క్రీన్ పై వ్రాస్తూ బోధించవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానించి, అవసరమైన సందర్భంలో వీడియో లు,చిత్రాలను చూపిస్తూ బోధన చేయవచ్చు. దీనిలో ఉన్న గణిత ఉపకరణాలను ఉపయోగించి గణిత నిర్మాణాలు గీయడం చాలా సులభంగా విద్యార్థులకు నేర్పించ వచ్చు. వ్రాసిన ముఖ్యమైన విషయాలను సేవ్ (నిక్షిప్తం) చేసుకుని,మరలా తిరిగి చూపించవచ్చు. దీని వలన విద్యార్థులకు మంచి అభ్యసన అనుభవాలను అందించవచ్చు.