నవతెలంగాణ- నసురుల్లాబాద్ (బీర్కూర్)
స్వామి వివేకానంద 121వ వర్ధంతి సందర్భంగా బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం బీర్కూర్ ప్రభుత్వం జూనియర్ కళాశాల అధ్యాపకులు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల అధ్యాపకులు
పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్, దేవి సింగ్, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.