పోడు భూములకు పట్టాలు పేరుతో వసూళ్ళు..

– బాధితుడి పిర్యాదు పై కేసు నమోదు…

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలోని పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని దమ్మపేట కు ఒకరిపై కేసు నమోదు అయినట్లు ఎస్.ఐ రాజేష్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం దమ్మపేట కు చెందిన సామేలు అనే వ్యక్తి అశ్వారావుపేట మండలం రమణ అక్క పేట కు చెందిన పలువురి వద్ద నుండి పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని రూ.2 లక్షల 67 వేలు వసూలు చేసాడు. కానీ మంజూరైన జాబితాలో వీరి పేర్లు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన వూకే సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Spread the love