దళిత ఉద్యమ గీతికకు కొవ్వొత్తులతో నివాళులు..

నవతెలంగాణ – బెజ్జంకి
ఆట, పాట, మాటలతో వేదికలను అలరించిన తెలంగాణ సాధనోద్యమ దళిత గీతిక మూగబోయిందని మండల కేంద్రంలోని యువకులు అవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, గాయకుడు సాయి చంద్ ఆకాల మృతి చెందడంపట్ల సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులతో నివాలర్పించారు. సాయి చంద్ నిరుపేద కుటుంబంలో జన్మించి తెలంగాణ రాష్ట్ర సాధనలో గాయకుడిగా తనదైన శైలిలో ప్రముఖ పాత్ర పోషించారాని యువకులు దిగ్భాంది వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ రాగుల నర్సయ్య, సీపీఐ నాయకులు బోనగిరి రూపేశ్, మహేందర్, సంగెం మధు, మాలమహనాడు నాయకుడు ర్యాకం రాజు, మిద్దె రవి, విజయ్ తదితరుల పాల్గొన్నారు.

Spread the love