ఆరోగ్యమే.. మహా బాగ్యంలో భాగాస్వాములవ్వాలి

– రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్
– ఉచిత క్యాన్సర్ ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన
నవతెలంగాణ- బెజ్జంకి
మధ్యపానం,నిషేధిత పోగాకు,ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల నేడు క్యాన్సర్ వ్యాది మహామ్మరిలా వ్యాప్తి చెందుతోందని..క్యాన్సర్ కారక వస్తువులను ప్రజలు నివారించి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆరోగ్యమే..మహాబాగ్యంలో అందరూ భాగాస్వాములవ్వాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ సూచించారు.గురువారం మండల కేంద్రంలోని సీయోన్ ఎవాంజెలికల్ చర్చి నిర్వహాకులు ఓరుగంటి మిరియం,పాస్టర్ విక్కీ అద్వర్యంలో గ్రెస్ హర్వెస్ట్ మినిస్ట్రీస్ తానా సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిభిరానికి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ తో కలిసి సర్పంచ్ ద్యావనపల్లి మంజుల,ఎస్ఐ ప్రవీణ్ రాజ్ ముఖ్య అతిథులుగా హజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడారు. నిషేధిత పోగాకు ఉత్పత్తులు,ప్లాస్టిక్ వస్తువుల వినియోగించడం వల్ల క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తి చెందుతుందని.. ప్రజలందరూ భాగాస్వాములై ప్రభుత్వం చేపట్టిన ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలన్నారు. నిరుపేదలు క్యాన్సర్ మహమ్మారికి బలవుతున్నారని ఉచిత వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు పిల్లల నడవడికపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సిన అవశ్యకత ఉందని సర్పంచ్ ద్యావనపల్లి మంజుల సూచించారు.ప్రభుత్వాలు క్యాన్సర్ కారక పోగాకు ఉత్పత్తులను నిషేధం విధించిన వాటిని ప్రజలు వినియోగించడం వల్ల ప్రయోజనం లేకుండా పోతుందని క్యాన్సర్ కారక ఉత్పత్తులపై ప్రజలు అవగాహన కలిగియుండడమే ఆరోగ్యకరమని ఎస్ఐ ప్రవీన్ రాజు తెలిపారు.అనంతరం ముఖ్య అతిథులుగా హజరైన సర్పంచ్ మంజుల,ఎస్ఐ ప్రవీన్ రాజు,యువజన మండల ఐక్య సంఘాల అధ్యక్షుడు పోచయ్య,గ్రెస్ హర్వెస్ట్ పౌండేషన్ వైద్య సిబ్బందిని చర్చి నిర్వహాకులు ఓరుగంటి మిరియం,విక్కీ శాలువా కప్పి ఆత్మీయ సన్మానం చేశారు. సుమారు 300 మందికి పైగా హజరైన ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. హర్వెస్ట్ మినిస్ట్రీస్ కళ బృందం సభ్యులు,చర్చి సంఘ సభ్యులు,అయా గ్రామాల ప్రజలు హజరయ్యారు.
ప్రజలు క్యాన్సర్ ను కొని తెచ్చుకుంటున్నారు
క్యాన్సర్ మహామ్మారి ప్రాణాంతక వ్యాది.ప్రభుత్వం నిషేధించిన ఉత్పత్తులను ప్రజలు కొని తెచ్చుకుని క్యాన్సర్ మహామ్మారి భారిన పడుతున్నారు.దీంతో నేడు ఎంతో మంది పేదప్రజలు మృతి చెందుతున్నారు.అధిక ఖర్చుతో కూడుకున్న క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలను గ్రెస్ హర్వెస్ట్ మినిస్ట్రీస్ తానా సహకారంతో ఉచితంగా నిర్వహిస్తున్నాం. కాన్సర్ కారక ఉత్పత్తులను ప్రజలు నివారించడమే ప్రథమ కర్తవ్యం.తానా సహకారంతో కామారెడ్డి జిల్లా చుక్కాపూర్, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ ప్రాంతాలతో పాటు నేడు బెజ్జంకిలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించాము.ఉచిత వైద్య శిభిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించడం అనందనీయం.
– కాలేబు, హర్వెస్ట్ మినిస్ట్రీస్ డైరెక్టర్.

Spread the love