ఉత్సహంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు


– వృద్దాశ్రమంలోని వృద్దులకు కాంగ్రెస్ శ్రేణుల అన్నదానం

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలో పార్టీ కార్యలయం వద్ద మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించగా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హజరై ఉత్సహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం యువజన నాయకుడు పులి కృష్ణ అద్వర్యంలో గాగీల్లపూర్ గ్రామంలోని వృద్దాశ్రమంలోని వృద్దులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేసి అన్నదానం చేశారు.నాయకులు బోనగిరి రాజేందర్,మైల ప్రభాకర్,రొడ్డ మల్లేశం,మంకాలి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love