నవతెలంగాణ – అశ్వారావుపేట
తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా సోమవారం మండలంలోని పేరాయిగూడెం పంచాయితీ పైర్ కాలని అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ విజయలక్ష్మి ఆద్వర్యంలో నలుగురు గర్భవతులకు సామూహిక సీమంతం జరిపారు.తల్లిపాల ప్రయోజనాలు, ముర్రుపాలు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి శ్రీరామ్మూర్తి, సర్పంచ్ సుమతి, అంగన్వాడీ సిబ్బంది రాణి,మరియమ్మ,రాజేశ్వరి, దుర్గ, రమణ శాంతకుమారి,ఎ.ఎన్.ఎం వెంకటరమణ, ఆశా కార్యకర్తలు,తల్లులు పాల్గొన్నారు.