మీ సేవ, ఫొటో స్టూడియోల్లో క్రిక్కిరిసిపోయిన జనం..

– గృహలక్ష్మి గడువు తక్కువ..
– దృవీకరణ లు ఎక్కువ…
– పరుగులు పెడుతున్న ఆశావాహులు..
– తహశీల్దార్ నియామకం ప్రశ్నార్ధకం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గృహలక్ష్మి పధకం అమలు కు దరఖాస్తులు స్వీకరిస్తూ గడువు మాత్రం ఈ నెల 10 వరకే విధించడంతో ఆశావాహులు పరుగులు పెడుతున్నారు. బుధవారం అశ్వారావుపేట లో ఉన్న మీ సేవ,ఫొటో స్టూడియో ల్లో ఎందులో చూసినా ఇసుకేస్తే రాలేని జనం క్రిక్కిరిసిపోయిన దృశ్యం కానవస్తుంది. ఈ దరఖాస్తు తో పాటు సుమారు 10 రకాల దృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉండటంతో ఆశావాహులు అయోమయానికి గురి అవుతున్నారు.ఖర్చు సైతం బాగానే అవడంతో ఆవేదనకు గురి అవుతున్నారు. పాస్ పోర్ట్ సైజ్ 2 ఫొటోలు,రేషన్,ఓటర్,ఆధార్,స్థలం డాక్యుమెంట్స్, ఇంటి పన్ను,కరెంట్ బిల్లు,బ్యాంక్ పాస్ బుక్ లాంటివి నకలు దరఖాస్తు తో జత చేయాల్సి రావడం ఇక్కట్లకు గురిచేస్తుంది.అద్దె జీవులకు ఇంటి పన్ను ఎలా ఉంటుంది,కరెంట్ బిల్లు వీరి పేరున ఎలా వస్తుంది. సాధారణం గ్రామాల్లో వారసత్వంగా ఉండే స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకుంటారు. వీరికి పట్టా లు ఎలా ఉంటాయి?అసలుకే ధరణి తో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని ఆశా వాసులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే నివాసం, ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు మంజూరి చేయాలంటే గత 15 రోజులుగా తహశీల్దార్ నియామకం మే ఇంకా జరగలేదు.ఇక్కడ ఉన్న డి.టి కి సైతం ఇంచార్జి అధికారం లేకపోవడం దృవీకరణ లు కష్టంగా మారింది ఆవేదన చెందుతున్నారు.
Spread the love