వీణవంక ఎస్సైగా ఎండీ ఆసీఫ్.. సవాల్ గా మారనున్న సివిల్ సమస్యలు

నవతెలంగాణ- వీణవంక
వీణవంక ఎస్సైగా ఎండీ ఆసీఫ్ నియమిస్తూ కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్సై శేఖర్ ను కరీంనగర్ వీఆర్ కు బదిలీ చేశారు. ఎండీ ఆసీఫ్ హుజురాబాద్ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్నారు. త్వరలో జరుగునున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో పులువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీణవంకకు వస్తున్న ఎస్సై ఆరీఫ్ కు సివిల్ సమస్యలు సవాల్ గా మారనున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై శేఖర్ సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుని బాధితులకే అన్యాయం చేసిన సంఘటనలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా పలువురు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదులు  సైతం చేసిన సంఘటనలు ఉన్నాయి. బొంతుపల్లి, హిమ్మత్ నగర్ కనపర్తి, రెడ్డిపల్లితో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అన్యాయానికి గురైన బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే నిందితులతో చేతులు కలిపి బాధితులపైనే కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు.  ఈ ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులైన సీపీ, డీజీపీలకు సైతం పలువురు బాధితులు ఫిర్యాదు చేసిన ఘటనలూ ఉన్నాయి. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణా, గంజాయి, పేకాట, రేషన్ బియ్యం అక్రమ సరఫరాను ప్రోత్సహించి అక్రమ సంపాదన సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కొంత మంది కమిషన్ ఏజెంట్లను నియమించుకుని వీలైనన్ని అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించిన సంఘటనలు సైతం ఉన్నట్లు బహిరంగంగానే చర్చలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఈ సంపాదనతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో రెండుచోట్ల విలువైన ఇంటిస్థలాలు కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఎస్సై శేఖర్ ఆగడాలపై ఉన్నతాధికారులకు మరిన్ని ఫిర్యాదులు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. కావున వీణవంకకు బదిలీపై వస్తున్న ఎస్సైకి ఈ సమస్యలు సవాల్ గా మారనున్నాయి. ఈ సమస్యలపై దృష్టి సారించి స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుకుంటున్నారు.
ముస్తాబాద్ పోస్టింగ్ కోసం ప్రయత్నం..
అధికారుల ట్రాన్స్ ఫర్ తప్పదనే సంకేతాలు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో మంచి పోస్టింగ్ కావాలని ఎస్సై శేఖర్ ప్రయత్నాలు సైతం గత రెండు నెలల నుండే మొదలు పెట్టినట్లు మండలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాగైనా సిరిసిల్లా జిల్లాలో ముస్తాబాద్ కు  బదిలీపై వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు మండలంలో బహిరంగ చర్చకు దారి తీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో భాగంగా  ప్రస్తుతం వీఆర్ కు బదిలీ అయినా కూడా తర్వాత ముస్తాబాద్ కే బదిలీ తప్పదనే చర్చ కొనసాగుతోంది.

Spread the love