కులవృత్తులను ఆదుకోవడానికి ముందుకు రావడం సంతోషకరం

నవతెలంగాణ-వీణవంక
కుల వృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకులు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు కులవృత్తిని అభివృద్ధి చేసేందుకు రూ.లక్ష ప్రకటించిన సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సహకరించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి, మంత్రి గంగుల కమలాకర్, విప్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి,  ఆ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రకటించిన రూ.లక్ష ఎలాంటి షరతులు లేకుండా, కాలయాపన చేయకుండా త్వరగా అందజేయాలని కోరారు. అలాగే తమ కులంలోని నిరుపేద విశ్వబ్రా హ్మణులు ఎక్కువగా ఉన్నారని, వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేయాలని, 50 సంవత్సరాలు దాటిన వారికి ఫించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేణు రవి, రాంపల్లి రాములు, వేణు బుచ్చన్న, మూగల వెంకటాచలం, దోమకొండ రవీంద్రాచారి, నమిలోజు కొండయ్య, తదితరులు మరి ఇతర విశ్వబ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నవారు.

Spread the love