నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అదివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద పోలిస్ శాఖ అద్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, గ్రామంలోని యువత 5కే రన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలతో పాటు అత్యవసర సేవలు అందిస్తుందని ఎస్ఐ ప్రవీణ్ రాజు అన్నారు. అనంతరం 5కే రన్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన బోనగిరి అజయ్, అరవింద్, శ్రావణ్ లకు బీఆర్ఎస్ నాయకులు ప్రోత్సాహక బహుమతులందజేశారు.