రన్నింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు

– హుస్నాబాద్ సీఐ ఏర్రల కిరణ్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
రన్నింగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5 కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా రన్నింగ్, వాకింగ్, ధ్యానం చేయాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5కే నిర్వహించినట్లు తెలిపారు. రన్నింగ్ లో రాణించిన విజేతలకు మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సిఐ ఎర్రల కిరణ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, కౌన్సిలర్ బోజు రమాదేవి రవీందర్ పాల్గొన్నారు.

Spread the love