గ్రామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

– సీడీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్
నవతెలంగాణ-వీణవంక
గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (సీడీఆర్) విజయ్ కూమార్  అన్నారు. ఆయన మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని స౦దర్శ౦చి తనిఖీ చేసినారు.తనిఖీలో బాగ౦గా గ్రామ౦లొ నిర్మి౦చుకున్న వ్యక్తిగత మరుగుదోడ్డ్లు, తాగునీటి ట్యాంక్, స్మశానవాటిక, సేగ్రిగేషన్ షెడ్, నర్సరీ, పారిశుధ్యం, గ్రామంలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం పనులు పూర్తి స్థాయిలో చేయించాలని, కాలువలల్లో మురుగు నీరు సక్రమముగా పోయే విధముగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాద వశాత్తు  జ్వరం, జలుబు, అంటు వ్యాధులకు గురైతే వారి వివరాలను వెంటనే ప్రత్యేక రిజిష్టర్ నందు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో క్లోరినేషన్, చెత్త సేకరణ సక్రమంగా ఉండేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీలత, ఎంపీవో కే ప్రభాకర్, సర్పంచ్ అంగడి రాధ, ఉప సర్పంచ్ గెల్లు రమేష్, వార్డు సభ్యుడు భాస్కర్ రెడ్డి, ఈజీఎస్ ఏపీవో గట్టు స్వామి, ఏపీఎం కొమురయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love